స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

ఒకస్థాయిలో 700 పాయింట్లు పడిపోయిన డౌజోన్స్‌ తరవాత కోలుకుని  79 పాయింట్ల నష్టంతో ముగిసింది. నాస్‌డాక్‌ కూడా భారీగా క్షీణించినా.. తరవాత కోలుకుని అర శాతం లాభంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. అయితే లాభాలు పరిమితంగానే ఉన్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు రాత్రి కూడా భారీగా క్షీణించాయి. ఉదయం నుంచి అదే ట్రెండ్‌ కొనసాగుతోంది. దీంతో ఆసియా మార్కెట్లలో కాస్త రిలీఫ్‌ కన్పిస్తోంది. ఇక మన మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి 40 పైసలు లాభపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే ప్రస్తుతం నిఫ్టి 23 పాయింట్ల లాభంతో 10,624 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో ఉంది. 

ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్ల సూచీలు గ్రీన్‌లో ఉన్నా.. లాభాలు పరిమితంగా ఉన్నాయి. నిఫ్టి 39 షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రెండు శాతం లాభపడింది. తరువాతి స్థానంలో ఐఓసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌పీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌లో ఉంది. ఈ షేర్‌ 4 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. గెయిల్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌ ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి.