క్ష‌ణాల్లో న‌ష్టాల్లోకి నిఫ్టి

క్ష‌ణాల్లో న‌ష్టాల్లోకి నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. మ‌న మార్కెట్లు మాత్రం న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే స్వ‌ల్ప లాభాల‌తో మొద‌లైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే న‌ష్టాల్లోకి జారుకుంది. ప్ర‌స్తుతం 56 పాయింట్ల న‌ష్టంతో 10,716 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా లాభాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి అన్ని ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. ఒక్క జ‌పాన్ నిక్కీ మాత్ర‌మే స్వ‌ల్ప న‌ష్టాల‌తో ట్రేడ‌వుతోంది.

ఇక ఉద‌యం నుంచి మన మార్కెట్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. ఉద‌యం ఆరంభంలో అయిదు శాతంపైగా లాభ‌ప‌డిన జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షేర్‌లో అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది. అలాగే డిష్ టీవీలో కూడా. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో లాభాల‌తో ట్రేడ‌వుతున్న షేర్ల‌లో ఎల్ అండ్ టీ, విప్రో, టీసీఎస్‌, ఏషియ‌న్ పెయింట్స్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్న షేర్ల‌లో అదానీ పోర్ట్స్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఎస్ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, బ‌జాజ్ ఫైనాన్స్ షేర్లు ఉన్నాయి. చురుగ్గా ట్రేడ‌వుతున్న ఇత‌ర షేర్ల‌లో ఆర్ కామ్‌, సుజ్లాన్ షేర్లు మూడు శాతం న‌ష్ఠంతో ట్రేడ‌వుతున్నాయి.