భారీ లాభాల‌తో నిఫ్టి ఆరంభం

భారీ లాభాల‌తో నిఫ్టి ఆరంభం

అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలు ఇవ్వ‌డంతోపాటు దేశీయంగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుప‌డ‌టంతో నిఫ్టి భారీ లాభాల‌తో ప్రారంభ‌మైంది. రాత్రి యూరో మార్కెట్లు భారీ లాభాల‌తో, అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. డాల‌ర్ ఇండెక్స్ 97.40 నుంచి 97కు క్షీణించింది. అమెరికాలో చ‌మురు నిల్వ‌లు తగ్గిన‌ట్లు వారాంత‌పు నివేదిక‌లు వ‌చ్చినా.. ముడి చ‌మురు ధ‌ర‌లు పెద్ద‌గా పెర‌గ‌లేదు. దీంతో రూపాయి ఇవాళ ఒపెనింగ్‌లోనే 30 పైస‌లు బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో నిఫ్టి 70 పాయింట్ల లాభంతో 10,800పైన ట్రేడ‌వుతోంది. 

ఫార్మా మిన‌హా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల షేర్లు మంచి జోరు మీద ఉన్నాయి. ఎస్‌బీఐ ఏకంగా రూ. 8 పెరిగింది. ఇత‌ర పీఎస్‌యూ బ్యాంకులు బాగా పెరిగాయి. అలాగే రియాల్టి షేర్లు కూడా. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ గెయిన‌ర్‌గా నిలిచింది. త‌ర‌వాతి స్థానాల్లో ఎస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్ ఉన్నాయి. ఇక న‌ష్ట‌పోయిన నిఫ్టి షేర్ల‌లో స‌న్ ఫార్మా, సిప్లా, యూపీఎల్‌, హీరో మోటో కార్ప్‌, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. యాక్టివ్‌గా ఉన్న ఇత‌ర షేర్ల‌లో ఇన్ఫీబీమ్ ఆరు శాతం పెరిగింది.