స్వ‌ల్ప లాభాల‌తో నిఫ్టి

స్వ‌ల్ప లాభాల‌తో నిఫ్టి

ఆర్బీఐ ప్ర‌క‌టించే ప‌ర‌ప‌తి విధానం కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసినా.. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. జ‌పాన్ నిక్కీ స్వ‌ల్ప న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు స్వ‌ల్ప లాభంతో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్ర‌స్తుతం 35 పాయింట్ల లాభంతో 11,095 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టిలో 36 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇవాళ ఉద‌యం 11.45 గంట‌ల‌కు ప‌ర‌ప‌తి విధానం ప్ర‌క‌టించ‌నుంది ఆర్బీఐ. పావు శాతం వ‌డ్డీని ఆర్బీఐ త‌గ్గించ‌వ‌చ్చ‌ని మార్కెట్ ఆశిస్తోంది.

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో స‌న్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్‌, బ‌జాజ్ ఆటో, ఐష‌ర్ మోటార్స్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ముందున్న నిఫ్టి షేర్ల‌లో జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, టెక్ మ‌హీంద్రా ఉన్నాయి. మ‌రోవైపు అనిల్ అంబానీ కంపెనీల్లో భారీ అమ్మ‌కాల ఒత్తిడి కొన‌సాగుతోంది. రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ ఇవాళ కూడా 17 శాతం క్షీణించి రూ. 127 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఏడాది క్రితం ఈ షేర్ రూ. 490 ప్రాంతంలో ఉండేది. ఇక ఆర్ ప‌వ‌ర్‌, ఆర్ కామ్‌ల‌లో కూడా భారీ అమ్మ‌కాల ఒత్తిడి వ‌స్తోంది.