నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

గత కొన్ని సెషన్స్‌లో భారీ లాభాలు గడించిన నిఫ్టి ఇవాళ శాంతించింది. ఓపెనింగ్‌ స్థిరంగా ఉంది. అమెరికా మార్కెట్లు నిలకడగా క్లోజ్‌ కాగా, ఆసియా మార్కెట్లు మాత్రం ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. క్రూడ్‌ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అలాగే డాలర్‌తో రూపాయి విలువ కూడా స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి ప్రస్తుతం క్రితం స్థాయి 11,303 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి షేర్లలో పెద్ద హెచ్చుతగ్గులు లేవు. నిఫ్టి షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో ఐఓసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌ షేర్లు ముందున్నాయి. ఇతర షేర్లలో బజాజ్‌ కన్సూమర్‌ ఇవాళ కూడా 7 శాతం క్షీణించగా, రిలయన్స్‌ చేతికి చిక్కే ఛాన్స్‌ ఉన్న అలోక్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 10 శాతం పెరిగింది. ఇక బీఎస్‌ఇలో మన్‌పసంద్‌ షేర్‌ హవా కొనసాగుతోంది. ఇవాళ కూడా ఈ షేర్‌ 5 శాతం పెరగ్గా, డీఎల్‌ఎఫ్, ఐఆర్‌బీ షేర్లు నాలుగు శాతం పెరిగాయి. నష్టాల్లో ఉన్నవాటిల్లో క్వాలిటీ 5 శాతం, స్పైస్‌ జెట్‌ 4 శాతం నష్టంతో ట్రేడవుతోంది.