స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టి

 స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టి

రోజంతా తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి చివర్లో స్వల్ప లాభంతో ముగిసింది. మిడ్‌ సెషన్‌లో 10,798కి పడిపోయిన నిఫ్టి చివర్లో వచ్చిన మద్దతు కారణంగా 10,849 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 86 పాయింట్లు లాభపడింది. ఆర్థిక ఫలితాల కారణంగా అనేక బ్లూచిప్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా బీమా రంగం కంపెనీల్లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ షేర్లు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. క్రూడ్‌ స్థిరంగా ఉండగా, డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా పెరిగింది. రూపాయి తాజా సమాచారం అందేటపుడు ... స్వల్పంగా బలపడింది. నిఫ్టి షేర్లలో ఇవాళ రియాల్టి షేర్ల సూచీ రెండు శాతం విశేషం. కొత్త సీఎండీ పేరు వెల్లడి కావడంతో ఎస్‌ బ్యాంక్‌ ఇవాళ 15 శాతం పెరిగి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇదే టాప్‌ గెయినర్‌. తరువాతి స్థానాల్లో రిలయన్స్‌, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ముందున్న షేరు. ఇన్‌ఫ్రాటెల్‌... త్వరలోనే ఈ షేర్‌ను నిఫ్టి నుంచి తొలగించనున్నారు. తరువాతి స్థానాల్లో టాటా మోటార్స్‌, యూపీఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ ఫార్మా ఉన్నాయి. ఇవాళ ఆటో షేర్లు భారీగా క్షీణించాయి. అశోక్‌ లేల్యాండ్‌ 5 శాతం క్షీణించింది.