స్థిరంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

 స్థిరంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం వరకు పడటం.. తరవాత కోలుకుని లాభాల్లో క్లోజ్‌ కావడం మార్కెట్‌లో కన్పిస్తోంది. అలాగే ఇవాళ కూడా స్వల్ప లాభంతో పెరిగినట్లే పెరిగి... వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్‌... మిడ్‌ సెషన్‌ కల్లా 11,550కి క్షీణించింది. నష్టాల నుంచి యూరో మార్కెట్లు లాభాల్లోకి రావడంతో నిఫ్టి కూడా పుంజుకుని 11,606 గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 12 పాయింట్లు పెరిగి 11,596 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ షేర్లు అనూహ్యంగా కోలుకున్నాయి. ఇవాళ తొలి విడత పోలింగ్‌ పూర్తయింది. ఇక నుంచి మార్కెట్‌ను పోలింగ్‌ సరళి కూడా ప్రభావితం చేసే అవకాశముంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌లో అప్‌ ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. ఈ షేర్‌ 2.5 శాతం పెరగ్గా, భారతీ ఎయిర్‌టెల్‌ కూడా రెండు శాతం పెరిగింది. తరువాతి స్థానాల్లో బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో వేదాంత టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో వాఖ్రాంగి  16 శాతం పెరగ్గా, శంకర బిల్డింగ్‌ 9 శాతం, స్సైస్‌ జెట్‌ 7 శాతం పెరిగాయి. మన్నపురం ఫైనాన్స్‌ 6 శాతం, ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌ 5 శాతం పెరిగాయి. ఇక నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లలో టాటా స్టీల్‌ (పీపీ) ఆర్‌ కామ్‌, వేదాంత, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్, జిందాల్‌ స్టీల్‌ ఉన్నాయి.