భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

ఎన్నికల రోజు తడబడిన స్టాక్‌ మార్కెట్‌ తరువాతి రోజు మోడీ ఎన్నికకు లాభాలతో స్వాగతం చెప్పింది. నిన్న ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిలను తాకిన నిఫ్టి, సెన్సెక్స్‌లు... లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి భారీగా బలపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. 11,748 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి కాస్త తగ్గి 11,658 పాయింట్ల కనిష్ఠ స్థాయికి తగ్గినా.. తరువాత కోలుకుంది. 11,859 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన తరువాత 11,844 స్థాయి వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 187 పాయింట్లు, సెన్సెక్స్‌ 623 పాయింట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా యూరో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టి షేర్లలో  కేవలం 5 షేర్లు నష్టాల్లో ఉండగా, మిగిలిన 45 షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌గా ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ షేర్లలో స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌, డెల్టా కార్పొరేషన్‌, ఇండియా సిమెంట్, గ్రాఫైట్‌, హెచ్‌ఈజీ షేర్లు  టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లలో జస్ట్‌ డయల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గృహ్‌ ఫైనాన్స్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, పీవీఆర్‌ షేర్స్ టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.