స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నా.. మన మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. కేవలం బ్యాంకింగ్‌ షేర్ల అండతో నిఫ్టి స్వల్ప లాభంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉదయం పాతిక పాయింట్ల లాభంతో ప్రారంభమైన మార్కెట్ రోజంతా  స్వల్ప హెచ్చతగ్గులకు లోనైంది.11,897 ఇవాళ్టి గరిష్ఠ స్థాయి కాగా.. ఒకదశలో 11,769 కనిష్ఠ స్థాయికి తాకినా.. క్లోజింగ్‌లో 11,870 వద్ద 27 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 86 పాయింట్లు లాభపడింది. మెక్సికోపై అమెరికా  సుంకాలు విధించాలన్న నిర్ణయాన్ని విరమించుకుందన్న వార్తలతో ముడి చమురు ధరలు రాత్రి భారీగా పెరిగాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయి కాస్త బలహీనపడింది. నిఫ్టిలో ఇవాళ 20 షేర్లు లాభపడగా, 29 క్షీణించాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌  టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌ బ్యాంక్‌, సిప్లా, పవర్‌ గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌... ఇన్ఫీబీమ్‌, గుజరాత్‌ ఫ్లోరైడ్‌, హెచ్‌సీసీ, వోల్టాస్‌, డిష్‌మ్యాన్‌ కార్బొ. సెన్సెస్‌ టాప్‌ లూజర్స్‌... రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, దీవాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, పీసీ జ్యువల్లర్స్‌.