నిఫ్టి... నష్టపోయినా...

నిఫ్టి... నష్టపోయినా...

మార్కెట్‌ ఇవాళ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఉదయం దాదాపు క్రితం ముగింపు వద్ద ప్రారంభమైన మార్కెట్‌... వెంటనే నష్టాల్లోకి చేరుకుంది. అక్కడి నుంచి మిడ్‌ సెషన్‌ వరకు స్వల్పంగా కోలుకున్నా... చివరగా దాదాపు క్రితం స్థాయికి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 6.5 పాయింట్ల నష్టంతో 11,748 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో కూడా పెద్దగా మార్పులు లేవు. నిన్న అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసినా.. ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.ఈ వారమంతా చైనా, జపాన్‌ మార్కెట్లకు సెలవు. మన మార్కెట్లకు కూడా రేపు సెలవు. సాయంత్రం నుంచి కమాడిటీ మార్కెట్లు మాత్రం పనిచేస్తాయి. ఇవాళ మార్కెట్‌ను కాపాడింది కేవలం మెటల్స్‌, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మాత్రమే. ఫైనాన్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకుల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి ప్రధాన షేర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐఓసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీపీసీఎల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హీరో మోటో కార్ప్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 
సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌... టాటా స్టీల్‌ (పీపీ) రెడింగ్టన్‌, గ్రీవ్స్‌కాటన్‌, బ్లూడార్ట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాప్‌ లూజర్స్‌... ఎస్‌ బ్యాంక్‌, ఆర్‌ కామ్‌, ఆంధ్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, బాంబే డైయింగ్‌