నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

తీవ్ర ఒడుదుడుకుల మధ్య నిఫ్టి నష్టాలతో ముగిసింది. నిన్న అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు ఓపెనింగ్‌లో చాలా స్థిరంగా ఉన్నాయి. క్రమంగా నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు తరవాత కోలుకోలేదు. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తం కావడంతో నిఫ్టికి మద్దతు కరువైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 52 పాయింట్ల నష్టంతో 10,198 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 176 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి ప్రధాన షేర్లలో టెక్‌ మహీంద్రా, జీ టెలి, గ్రాసిం, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్‌, గెయిల్‌ షేర్లు లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్‌పీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, సిప్లా, ఐఓసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇతర షేర్లలో దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 12 శాతం పైగా పెరగ్గా, యూనియన్‌ బ్యాంక్‌ 8 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4 శాతం చొప్పున పెరిగాయి.