రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీ...కానీ ?

  రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీ...కానీ ?

71వ గణతంత్ర వేడుకలను  దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆవరణలో స్పీకర తమ్మినేని సీతారాం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏపీ శాసనమండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని మండలి ఛైర్మన్ షరీఫ్‌ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండలిలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానని అన్నారు. బిల్లులు శాసనమండలి సెలెక్ట్ కమిటీకి వెళ్తాయని, రెండు రోజుల్లో కమిటీనీ ఏర్పాటుచేస్తామని చెప్పారు. శాసనమండలి రద్దయితే బిల్లుల  పరిస్థితి ఏంటన్న విషయం తనకు తెలియదని, ఆ విషయం పరిశీలించాలని అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించడానికి ఓటింగ్ అవసరం లేదని, మూడ్ ఆఫ్ ది హౌస్, మెజారిటీ ప్రకారం నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.