500కోట్ల బ‌డ్జెట్‌తో.. షారూక్ - క‌రీనా పెయిర్‌..

500కోట్ల బ‌డ్జెట్‌తో.. షారూక్ - క‌రీనా పెయిర్‌..

2018-19 మోస్ట్ అవైటెడ్ మూవీ గురించిన ఆస‌క్తిక‌ర సంగ‌తి ఇది. భార‌త‌దేశ వ్యోమగామి.. అంత‌రిక్షంలో అడుగుపెట్టిన తొలి భార‌తీయ సైంటిస్ట్ రాకేశ్ శ‌ర్మ జీవిత‌క‌థ‌ను `సెల్యూట్‌` పేరుతో వెండితెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.  కింగ్ ఖాన్ షారూక్ కథానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 500కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించనున్నార‌ని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి క‌థానాయిక ఫైన‌ల్ అయ్యింది. 

వాస్త‌వానికి ఈ సినిమాలో మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించాల్సింది. కానీ అత‌డు `మ‌హాభార‌తం 3డి` సిరీస్‌ని సొంత బ్యాన‌ర్‌లో నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతున్నందున ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. ఆ క్ర‌మంలోనే షారూక్‌ని ఫైన‌ల్ చేసి సెట్స్‌కెళుతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని ప్ర‌చార‌మైనా, చివ‌రి నిమిషంలో పేరు మారింది. తాజాగా ఆ అవ‌కాశం బెబో క‌రీనాక‌పూర్‌ని వ‌రించింద‌ని తెలుస్తోంది. భార‌త‌దేశ‌పు తొలి స్పేస్‌మేన్ బ‌యోపిక్ లో క‌రీనా న‌టిస్తుందంటూ ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మ‌హేష్ మాథాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య చోప్రా- సిద్ధార్థ్ రాయ్ క‌పూర్‌- రోనీ స్క్రూవాలా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.