సర్ప్రైజ్ చేసిన శర్వానంద్ రణరంగం

సర్ప్రైజ్ చేసిన శర్వానంద్ రణరంగం

శర్వానంద్ తన 27 వ సినిమా రణరంగం ఫస్ట్ లుక్ టైటిల్ ను ఈరోజు రిలీజ్ చేస్తారు.  టైటిల్ తో పాటు శర్వానంద్ ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని ఈ చిన్న టీజర్ ద్వారా చూపించారు.  సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  రెండు డిఫరెంట్ పాత్రల్లో శర్వానంద్ కనిపించబోతున్నారు.  ఒకటి మిడిల్ ఏజ్ వ్యక్తికాగా, మరొకటి యువకుడి పాత్ర.  

కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు.  గ్యాంగ్ స్టర్ సినిమాలకు మార్గదర్శకత్వంగా నిలిచిన గాడ్ ఫాదర్ సినిమాలోని లుక్ ఎలా ఉంటుందో అలాంటి లుక్ తో అదరగొట్టాడు శర్వానంద్.  ఆగష్టు 2 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.