శర్వానంద్ రణరంగం టీజర్ టాక్

శర్వానంద్ రణరంగం టీజర్ టాక్

శర్వానంద్ హీరోగా చేస్తున్న రణరంగం సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  ఇందులో రెండు షేడ్స్ లో శర్వానంద్ కనిపిస్తున్నాడు.  క్లుప్తంగా చెప్పాలంటే ఇది గ్యాంగ్ స్టర్ స్టోరీ.  కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనే డైలాగ్ తో టీజర్ ను ముగించారు.  ఓపెనింగ్ ను చాలా సీరియస్ గా చూపిస్తూ.. దేవుడ్ని నమ్మాలంటే భక్తి ఉంటె సరిపోతుంది.  మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి అని చెప్తూ యాక్షన్ సీన్స్ ను ప్లే చేశారు.  ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అని అర్ధం అవుతున్నది.  తనపై ఎటాక్ చేయాలనుకున్న వాళ్ళను శర్వానంద్ ఎలా ఎదిరించారు.  ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని అర్ధం అవుతున్నది.  టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్ గా ఉంది.  మొత్తానికి టీజర్ పర్వాలేదనిపించింది.  సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.