ఎన్టీఆర్ బయోపిక్ లో శర్వానంద్ పాత్ర ఇదే..!

ఎన్టీఆర్ బయోపిక్ లో శర్వానంద్ పాత్ర ఇదే..!
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది.  ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటి వరకు బాలకృష్ణ తప్పించి మిగతా పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే దానిపై ఖచ్చితమైన సమాధానం లేదు.  దీంతో ఈ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి.  అసలు సినిమా తీస్తారా తీయరా అనే డౌట్ కూడా వచ్చింది.  దర్శకుడు తేజ పక్కకు తప్పుకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. 
 
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక మొదలైంది.  చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను ఓకే చేశారు.  బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు.  యువ హీరో శర్వానంద్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు.  ఎన్టీఆర్ యుక్తవయసులో ఉండగా సన్నగా ఉండేవారు.  ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని బాలకృష్ణ చేస్తున్నారు.  అయితే, ఎన్టీఆర్ యుక్తవయసులో ఉన్న పాత్రలో బాలకృష్ణ నటించడం కష్టమైనా పనే.  ఎన్టీఆర్ సన్నగా మారాలి.  అది వీలయ్యే పనికాదు.  అందుకే యువ ఎన్టీఆర్ పాత్రకోసం ఓ యువ నటుడుని ఎంపిక చేయాలని అనుకోని చాలా మందిని పరిశీలించారు.  కాగా, శర్వానంద్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని చెప్పి, శర్వానంద్ ని ఎంపిక చేశారట.  ఈ ఎంపిక చాలా కాలం క్రితమే పూర్తయినా, సమాచారాన్ని గోప్యంగా ఉంచారని యూనిట్ చెప్తోంది.