బీజేపీకి షార్ట్ గన్ షాక్: సిన్హా

బీజేపీకి షార్ట్ గన్ షాక్: సిన్హా

గత కొన్నాళ్లుగా బీజేపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న శత్రఘ్న సిన్హా  కమలం పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆర్జేడీ లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఆర్జేడీ అధినేత తేజశ్వనీ యాదవ్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సిన్హా .. లాలూ ప్రసాద్ యాదవ్ తన స్నేహితుడని తెలిపారు. ఇద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మని చెప్పారు సిన్హా . 2019 పార్లమెంటు ఎన్నికల్లో తాను బీహార్లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దానా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పై రాగానే శతృఘ్న సిన్హా  ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరగంటకు పైగా వారి మధ్య మంతనాలు సాగాయని సమాచారం.