షీలా దీక్షిత్‌కు కన్నీటి వీడ్కోలు 

షీలా దీక్షిత్‌కు కన్నీటి వీడ్కోలు 

అధికారిక లాంఛనాల మధ్య ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇవాళ ఉదయం షీలా దీక్షిత్‌ భౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించి.. అక్కడి నుంచి మధ్యాహ్నం ఢిల్లీ పీసీసీ కార్యాలయానికి భౌతిక కాయాన్ని తరలించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్‌.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు.