ఈ డ్రోన్లు చూశారా...

ఈ డ్రోన్లు చూశారా...

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చైనా ముందుంటుంది. డ్రోన్ల వినియోగంలోనూ ఆ దేశం ముందంజలో ఉంది. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాలతోపాటు వ్యవసాయ రంగంలోనూ డ్రోన్లను అక్కడ  విస్తృతంగా వాడుతున్నారు. ఆఖరికి సైన్యంలోనూ వినియోగిస్తున్నారు.  పైనుంచీ ఫొటోలు తీయాలంటే ఇప్పటివరకూ హెలికాప్టర్లను వాడేవారు. ఇప్పుడు డ్రోన్లే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో వేలాది రకాల డ్రోన్లున్నాయని చెబుతుంటారు. ఇందులో కొన్నింటిని షెంజన్‌లో జరుగుతున్న 2018 డ్రోన్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శనకు ఉంచారు. 
సెల్‌ఫోన్‌ కేస్‌లో ఇమిడిపోయే బుల్లి డ్రోన్‌, డోర్‌ డెలివరీకి వాడే డాల్ఫిన్‌ ఆకారపు డ్రోన్‌.. ఇలా.. మొత్తం పదుల సంఖ్యలో డ్రోన్ల మొడళ్లను ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో ఓ డ్రోన్‌.. 200 నుంచి 300 కిలోల బరువును మొస్తుందని దాని తయారీదారుడు చెప్పారు. సైన్యంలో ఉపయోగించే ఫైర్‌ ఫైటింగ్‌ డ్రోన్‌ ఈ ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.