అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారు: శిఖా

అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారు: శిఖా

ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరామ్ హత్యకేసులో గురువారం శిఖా చౌదరిని పోలీసులు విచారించారు. బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్ లో సుమారు ఎనిమిది గంటలపాటు విచారణ జరిగింది. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన విచారణ అనంతరం శిఖా చౌదరి మీడియా ముందుకు వచ్చారు. కేసు దర్యాప్తు పూర్తికానందున అన్ని విషయాలు మీడియాకు చెప్పలేనని అన్నారు. జయరామ్ హత్యకు సంబంధించి తనకు తెలిసిన విషయాలను పోలీసులకు చెప్పినట్లు తెలిపింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు తెలిపారని పేర్కొంది. 

సంచలనం సృష్టించిన జయరామ్ హత్యకేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. జయరామ్ ను హాని ట్రాప్ చేసి రాకేష్ ఇంటికి పిలిపించింది సూర్య అలియాస్ డుంబు అని పోలీసులు నిర్ధారించారు. కమెడియన్ తో పాటు మిమిక్రి ఆర్టిస్ట్ అయిన సూర్య అమ్మాయి వాయిస్ తో జయరామ్ ను ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు.