ఆసీస్ లక్ష్యం 359

ఆసీస్ లక్ష్యం 359

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో కోహ్లీ సేన భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసి.. ఆసీస్ ముందు 359 పరుగుల భారీ లక్ష్యంను ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ ఆచితూచి ఆడగా.. ధావన్ ఆసీస్ పేసర్లను ధీటుగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ శతకాలు చేశారు. ఇద్దర కలిసి తొలి వికెట్‌కు 193 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో 95 పరుగుల వద్ద రోహిత్ అవుటయ్యాడు.

రోహిత్ నిష్క్రమణ అనంతరం ధావన్ (102: 97 బంతుల్లో 12ఫోర్లు, సిక్స్) సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ తర్వాత ధావన్ మరింత దూకుడు పెంచాడు. అయితే 143 (115 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులు చేసి పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (7) పరుగులకే పెవిలియన్ చేరాడు. రిషభ్ పంత్‌ వరుస ఫోర్లతో విరుచుకుపడి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ధాటిగా ఆడే క్రమంలో పంత్ (36), జాదవ్ (10) అవుట్ అయ్యారు. చివరలో విజయ్ శంకర్ (26) భారత స్కోరును 250 దాటించాడు. చివరి ఓవర్లో శంకర్ అవుట్ అయినా.. బుమ్రా సిక్సుతో ఇన్నింగ్స్ ను ముగించాడు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 5 వికెట్లు తీసాడు.