ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ ... ధావన్‌ సూపర్ 

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ ... ధావన్‌ సూపర్ 

ఇండియా‌-అఫ్గానిస్థాన్‌, శ్రీలంక-వెస్టిండీస్‌ టెస్టు మ్యాచ్‌ సిరీస్‌ ముగిసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో గబ్బర్‌ 10 స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. శిఖర్‌ ధావన్‌కు ఇప్పటి వరకు ఇదే కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు. మురళీ విజయ్‌ 23వ స్థానంలో నిలిచాడు. ఆసీస్‌ ఆటగాడు స్మిత్‌ ది అగ్రస్థానం. విరాట్‌ కోహ్లీ, రూట్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నయా వాల్‌ పుజారా 6వ స్థానంలోనే ఉన్నాడు.  బౌలర్ల విషయానికొస్తే రవీంద్ర జడేజా మూడో స్థానంలో నిలిచాడు. అశ్విన్ ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు.