ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన ఘనత

ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన ఘనత

ఐపీఎల్‌-11లో టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో నాలుగు వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ధావన్‌ చోటు సంపాదించాడు. శుక్రవారం క్వాలిఫయర్‌-2లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధావన్‌ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 4×4, 1×6లతో 34 పరుగులు చేసి.. నాలుగు వేల పరుగుల మైలురాయిని సాధించిన ఎనిమిదో  క్రికెటర్‌గా ధావన్‌(4032) రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో భారత ఆటగాడు సురేష్ రైనా(4953) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్‌ కోహ్లీ(4948), రోహిత్‌ శర్మ(4493), గౌతమ్‌ గంభీర్‌(4217), రాబిన్‌ ఉతప్ప(4086)లు ఉన్నారు. ధావన్ తర్వాత ఎంఎస్‌ ధోనీ(4016), డేవిడ్‌ వార్నర్‌(4014)లు ఉన్నారు.

Photo: FileShot