పక్షులకు ఆహారం వేసి వివాదంలో చిక్కుకున్న ధావన్...

పక్షులకు ఆహారం వేసి వివాదంలో చిక్కుకున్న ధావన్...

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ నిబంధనలు ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఇటీవల వారణాసిలో పర్యటించిన ధావన్ అక్కడ గంగా నదిలో బోట్‌లో విహరించాడు. ఈ సందర్భంగా పక్షులకు ఆహారం అందజేశాడు. ఇందుకు సబంధించిన ఫొటోలను కూడా ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుండటంతో ధావన్‌ పడవలో విహరిస్తూ పక్షులకు ఆహారం  వేయడం వివాదాస్పదమైంది. అలాగే మార్గదర్శకాలు పాటించకుండా, పడవలోకి పర్యాటకులను అనుమతించిన బోటు యజమానిపై చర్యలు తీసుకుంటామని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ కౌశల్‌‌ రాజ్‌ శర్మ తెలిపారు. ఈ ఘటన పై మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు.