వరల్డ్‌ కప్‌ నుంచి ధావన్ ఔట్..!

వరల్డ్‌ కప్‌ నుంచి ధావన్ ఔట్..!

ఐసీసీ వరల్డ్ కప్ 2019 నుంచి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఔట్ అయ్యారు... ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్.. అదే మ్యాచ్‌లో వేలికి గాయం అయ్యింది. దీంతో ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా రెస్ట్ అవసరం కావడంతో... మూడు వారాల పాటు గబ్బర్ వరల్డ్ కప్ మ్యాచ్‌ కు దూరం కానున్నాడు. అయితే, మూడు వారాల పాటు అంటే.. ఈ వరల్డ్ కప్ అన్ని మ్యాచ్‌లకు గబ్బర్ దూరం అయినట్టే... ఇక ధావన్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్ కి ఛాన్స్ దొరికే అవకాశం ఉండగా... ఓపెనర్ గా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. ఫోర్త్ డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.