వరల్డ్ కప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్

వరల్డ్ కప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్

వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఎడమచేతి బొటనవేలుకు గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మెగా టోర్ని నుంచి నిష్క్రమించాడు. అతడి స్ధానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈనెల 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ గాయపడిన విషయం తెలిసిందే. కౌల్టర్‌నైల్‌ విసిరిన బంతి గబ్బర్‌ చేతికి బలంగా తగిలింది. ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. మ్యాచ్ అనంతరం స్కానింగ్‌ నిర్వహించగా.. వేలుకు ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. మూడు వారాల పాటు ధావన్ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలిపారు. అయితే జూన్‌ 30న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ వరకు కూడా అతడు కోలుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో శిఖర్ ధావన్ వరల్డ్ కప్ కు నుంచి తప్పుకున్నాడు.