ధావన్ ఔట్.. సంజు శాంసన్ ఇన్..

ధావన్ ఔట్.. సంజు శాంసన్ ఇన్..

డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు ముందు టీమిండియాలో మార్పులు చేశారు సెలక్టర్లు.. గాయం కారణంగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను తప్పించిన సెలక్టర్లు.. ఆ స్థానంలో వికెట్ కీపర్‌, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ను ఎంపిక చేసింది. కాగా, ఈ నెల సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ టీ20 గేమ్‌లో ఢిల్లీ తరపున ఆడాడు శిఖర్‌ ధావన్‌.. అయితే, మైదానంలో డైవింగ్ చేసినప్పుడు ఎడమ మోకాలికి లోతైన గాయం తగిలింది.. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. ధావన్‌ను పరిశీలించిన బీసీసీఐ వైద్య బృందం.. మరికొంత సమయం రెస్ట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది.. దీంతో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు టీ-20ల సిరీస్‌కు సంజు శాంసన్‌ను ఎంపిక చేశారు. 

కాగా, సంజు శాంసన్‌ను బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్ కోసం చోటు సంపాదించాడు.. భారత్ 2-1 తేడాతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. సంజుకు తుది జట్టులో స్థానం దక్కలేదు. తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదు.. ఇప్పుడు శిఖర్ ధావన్ గాయం కారణంగా మరోసారి అవకాశం దక్కింది. కాగా, వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, సంజు శాంసన్‌ను ఎంపిక చేశారు.