ఆ మ్యాచ్ అంటే చుట్టూ ఉన్న వాతావరణం నాపై ఒత్తిడి తెస్తుంది : శిఖర్ ధావన్

ఆ మ్యాచ్ అంటే చుట్టూ ఉన్న వాతావరణం నాపై ఒత్తిడి తెస్తుంది : శిఖర్ ధావన్

పాకిస్థాన్ తో టీమ్ ఇండియా 2015 ప్రపంచ కప్ మ్యాచ్‌కు ముందు పాక్ అభిమానులు తనపై షాట్ తీసుకున్నట్లు ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించారు. 2015 ప్రపంచ కప్‌కు ముందు తాను చెడ్డ పరుగులు చేస్తున్నానని, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో బాగా రాణించలేదని గుర్తుచేసుకున్నాడు. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, ధావన్ 2015 ప్రపంచ కప్ ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ 20 ఐ సిరీస్‌లో కేవలం 73 పరుగులు చేశాడు.

అయితే తాను అడిలైడ్ ఓవల్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు పాకిస్తాన్ అభిమానులు తనను ఎగతాళి చేశారని, ఈ మ్యాచ్‌లో తాను కేవలం 15 పరుగులు చేస్తానని వారు ఉహించారని శిఖర్ ధావన్ చెప్పాడు. అయితే, శిఖర్ ధావన్ ఆ మ్యాచ్ లో బలంగా నిలబడి 76 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అదే పాక్ అభిమానులు తరువాత నేను పెవిలియన్ వెళ్ళేటప్పుడు అదే వ్యక్తులు నా కోసం చప్పట్లు కొట్టారు అని శిఖర్ చెప్పాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే గ్రౌండ్ లోని వాతావరణం కారణంగా నేను ఒత్తిడికి గురవుతాను, మేము పాకిస్థాన్‌తో తలపడినప్పుడు భారత అభిమానుల అంచనా చాలా ఎక్కువగా ఉంటాయి . అందువల్ల భారత అభిమానుల కోసం, ఐసీసీ ఈవెంట్లలో టీమ్ ఇండియా పాకిస్తాన్ పై ఏ విధంగానైనా గెలవాలి అని ధావన్ చెప్పారు.