దుమ్మురేపిన ధావన్.. ఢిల్లీ విక్టరీ..

దుమ్మురేపిన ధావన్.. ఢిల్లీ విక్టరీ..

ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. శిఖర్ ధావన్‌ కళ్లుచెదిరేలా ఆడడంతో 7 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది ఢిల్లీ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ధావన్ 97 పరుగులతో దుమ్ములేపి నాటౌట్‌గా నిలిచిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పృథ్వీ షా 14, శ్రేయస్‌ అయ్యర్‌ 6, రిషబ్‌ పంత్‌ 46, ఇంగ్రామ్‌ 14 (నాటౌట్‌)పరుగులతో 18.5 ఓవర్లలోనే మూడు వికెట్టు కోల్పోయి విజయాన్ని అందుకున్నారు. ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌: డెన్లీ 0, శుభ్‌మన్‌ గిల్‌ 65, ఊతప్ప 28, రాణా 11, రసెల్‌ 45, కార్తీక్‌ 2, బ్రాత్‌వైట్‌ 6, చావ్లా 14 (నాటౌట్‌), కుల్‌దీప్‌ 2 (నాటౌట్‌)
ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌: పృథ్వీ షా 14, ధావన్‌ 97 (నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ 6, రిషబ్‌ పంత్‌ రాణా 46, ఇంగ్రామ్‌ 14 (నాటౌట్‌)