యువీ చాలెంజ్‌.. మళ్లీ బ్యాట్‌ పట్టిన ధావన్‌

యువీ చాలెంజ్‌.. మళ్లీ బ్యాట్‌ పట్టిన ధావన్‌

గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా.. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టాడు. ఎందుకో తెలుసా..? టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ విసిరిన 'బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌' కోసం. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ధావన్‌ను సవాల్‌ విసిరాడు యువీ. దీన్ని స్వీకరించిన ధావన్‌.. తన ట్రేడ్‌ మార్క్‌ షాట్‌తో బాల్‌ను కొట్టి బాటిల్‌ క్యాప్‌ను కిందపడేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్‌లో షేర్‌ చేసన ధావన్‌.. గాయం తర్వాత తొలిసారి బ్యాట్‌ పట్టానని.. చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.  ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగిన ధావన్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకు కూడా ధావన్‌కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.