ఐపీఎల్ 2020 : స్టెప్స్ వేస్తూ వేయిస్తున్న ధావన్...

ఐపీఎల్ 2020 : స్టెప్స్ వేస్తూ వేయిస్తున్న ధావన్...

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి అందరికి తెలుసు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ధావన్ కరోనా లాక్ డౌన్ సమయంలో తన కొడుకుతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలను అందులో పోస్ట్ చేసి అభిమానులను అలరించాడు. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020 మరో మూడు రోజులో ప్రారంభం కానుంది. దాంతో నెల ముందే తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ‌తో కలిసి దుబాయ్ వెళ్లిన ధావన్ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో ఖాళీ సమయం దొరికితే తన జట్టు ఆటగాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ కూడా స్టెప్స్ వేస్తూ వేయిస్తున్నాడు ధావన్. ఢిల్లీ జట్టులోకి ఈ ఏడాదే ఎంట్రీ ఇచ్చిన అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ లకు కొన్ని 'భాంగ్రా' డాన్స్ స్టెప్పులను నేర్పించాడు. ధావన్ వారికి ఎలా చేయాలో చెప్తుండగా మిగిలిన ఇద్దరు అతడిని ఫాలో అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఢిల్లీ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో సెప్టెంబరు 20న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.