మఠాధిపతి పై విష ప్రయోగం

మఠాధిపతి పై విష ప్రయోగం

కర్నాటక రాష్ట్రంలోని షిరూర్ మఠం అధిపతి లక్ష్మీవర తీర్ధస్వామి అనుమాన్పద స్ధితిలో మరణించారు. రాత్రి ఆస్వస్థతకు గురవ్వడంతో స్వామీజీని కస్తూర్భా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే ఆయన ప్రాణాలను విడిచారు. లక్ష్మీవర తీర్ధస్వామి మరణంపై ఆసుపత్రి వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు చెబుతున్నారు. బుధవారం రాత్రి ఒంటిగంటకు స్వామిజీ ఆరోగ్యం బాగాలేదంటూ ఆసుపత్రిలో చేర్చారని, అప్పుడు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నాడని, బ్లడ్ ప్రషర్ కూడా తక్కువగా ఉండటంతో ఐసీయులో ఉంచి చికిత్స అందించామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవినాష్ శెట్టి తెలిపారు. రక్త నమునాల్లో విషప్రయోగం జరినట్లు తెలుస్తుందని అన్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపామని, స్వామిజీ పార్ధీవ దేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరీకి తరలించామని వైద్యులు అంటున్నారు. పోస్ట్ మార్టం అనంతరం షీరూర్ లోని మఠానికి స్వామిజీ మృతదేహన్ని తరలించి అంతక్రియలు నిర్వహిస్తామని మఠం వర్గాలు తెలిపాయి.