భాజపాకు 119 మంది ఎక్కడి నుంచి వచ్చారు..? 

భాజపాకు 119 మంది ఎక్కడి నుంచి వచ్చారు..? 

మహారాష్ట్రలో రాజకీయాలో రోజుకో కొత్త మలుపు తిరుగున్నది.  నవంబర్ 8 వ తేదీతో అక్కడి ప్రభుత్వ గడువు ముగియడంతో కొత్త ప్రభత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీని మహా గవర్నర్ కోరగా దానిని బీజేపీ తిరస్కరించింది.  తమకు సంఖ్యాబలం లేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కుదరని పని చెప్పింది. దీంతో శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పిలవగా, శివసేన కూడా ఇచ్చిన సమయంలో ముందుకు రాలేకపోయింది.  

ఆ తరువాత ఎన్సీపీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని నిర్ణయం తీసుకోగా, ఎన్సీపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.  దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.  ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు కూడగట్టుకుని పనిలో ఉన్నాయి.  శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.  ఇదే సమయంలో బీజేపీ తమకు 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పడంతో శివసేన షాక్ అయ్యింది. 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇలా వచ్చిందని శివసేన ప్రశ్నిస్తోంది.  నితిన్ గడ్కారీ రాజకీయాన్ని క్రికెట్ తో పోల్చారు.  ఆటలో ఏదైనా జరగొచ్చు అని చెప్పడంతో.. మహాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సైలెంట్ గా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.