బీజేపీకి శివసేన రాంరాం! కేంద్రమంత్రి పదవికి శివసేన ఎంపీ రాజీనామా..

బీజేపీకి శివసేన రాంరాం! కేంద్రమంత్రి పదవికి శివసేన ఎంపీ రాజీనామా..

మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీకి రాంరాం చెప్పిన శివసేన.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటువైపు అడుగులు వేస్తోంది.. దీనిలో భాగంగా ఎన్సీపీ పెట్టిన డిమాండ్లకు శివసేన తలొగ్గింది. దీంతో.. కేంద్రమంత్రి పదవికి శివసేన ఎంపీ అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. అరవింద్ సావంత్ మోదీ కేబినెట్ నుంచి వైదొలిగారు. అయితే కేంద్ర కేబినెట్‌లో శివసేన నుంచి మంత్రిగా ఉన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ మద్దతు కావాలంటే ఎన్డీయే నుంచి వైదొలగాని ఎన్సీపీ కండీషన్ పెట్టిన నేపథ్యంలో సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అడుగులు వేస్తోంది.. మరోవైపు శివసేనకు మద్దతిచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది.. శివసేనకు మద్దతుపై సీడబ్ల్యూసీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇక, సాయంత్రం లోపు ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తెలపాలని శివసేనకు సూచించారు గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కావాలని శివసేన కోరుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో చర్చలకు శివసేన నేతలు రంగంలోకి దిగారు.