ఫడ్నవిస్ తో సంజయ్ రౌత్ రహస్య భేటీ... కారణం ఇదేనా...!

ఫడ్నవిస్ తో సంజయ్ రౌత్ రహస్య భేటీ... కారణం ఇదేనా...!

మహారాష్ట్రలో ఓ అపూర్వమైన పరిణామం చోటు చేసుకుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ, శివసేన పార్టీలు విడిపోయిన సంగతి తెలిసిందే.  శివసేన పార్టీ అటు కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.  2019 వరకు కలిసి పనిచేసిన బీజేపీ శివసేన లు విడిపోయిన తరువాత శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  అలాంటి సంజయ్ రౌత్ సడెన్ గా ఈరోజు మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో భేటీ అయ్యారు.  ముంబైలోని ఓ హోటల్ లో రహస్యంగా దాదాపుగా గంటకు పైగా భేటీ అయ్యారు.  దీంతో మహారాష్ట్రలో రాజకీయంగా మార్పులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి.  అయితే, ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు ఏమి లేవని, శివసేన అధికార పత్రిక సామ్నా ఇంటర్వ్యూ కోసమే సంజయ్ రౌత్ ఫడ్నవిస్ తో భేటీ అయ్యారని, బీహార్ ఎన్నికల తరువాత ఫడ్నవిస్ అందుబాటులో ఉంటానని రౌత్ కు చెప్పినట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఇటు శివసేన పార్టీ కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది.