రామమందిర నిర్మాణం జరిగి తీరుతుంది

రామమందిర నిర్మాణం జరిగి తీరుతుంది

ప్రధాని మోడీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోనే రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ అన్నారు. మందిర నిర్మాణం కోసమే ప్రజలు బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. రామమందిర నిర్మాణంపై తాము ఎలాంటి ఘనత తీసుకోబోమని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు భారీ విజయం కట్టబెట్టడానికి కారణం కూడా అదే అని సంజయ్‌ తెలిపారు. శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే అయోధ్యలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత నవంబర్‌లో విశ్వహిందూ పరిషత్‌, శివసేన కలిసి చేపట్టిన ధర్మసభ కార్యక్రమం సందర్భంగా ఉద్దవ్‌ ఠాక్రే అయోధ్యలో పర్యటించిన సంగతి తెలిసిందే.