షారుఖ్ ఇచ్చిన దానిని విరాళంగా ఇచ్చిన అక్తర్...

షారుఖ్ ఇచ్చిన దానిని విరాళంగా ఇచ్చిన అక్తర్...

బీసీసీఐ ఆధ్వర్యం లో 2008 లో ప్రారంభం అయిన ఐపీఎల్ టోర్నమెంట్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికి తెలుసు. అయితే ఆ మొదటి సీజన్లో మాత్రమే పాకిస్తాన్ ఆటగాళ్ళు ఐపీఎల్ లో పాల్గొన్నారు. ఇందులో పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్ లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో అక్త‌ర్ త అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతాను విజయ తీరాలకు చేర్చాడు. అయితే దానికి గుర్తుగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒక హెల్మెట్‌ పై తన సంతకం చేసి అక్తర్ కు బహుమతిగా ఇచ్చాడు. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా పాకిస్థాన్ కూడా వణికిపోతుంది. అందువల్ల కరోనా బాధితులకు సహాయం అందించడానికి తన వంతు సహాయంగా షారుక్ ఇచ్చిన ఆ హెల్మెట్‌ ను విరాళంగా ఇచ్చేసాడు అక్తర్. దీనికి సంబంధించిన విషయాన్ని తన సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేస్తూ తెలియజేసాడు. అయితే చూడాలి మరి దీని పైన షారుక్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది.