భారత్ మాకు ఇస్తే ఆ మేలు పాక్ మర్చిపోదు : అక్తర్

భారత్ మాకు ఇస్తే ఆ మేలు పాక్ మర్చిపోదు : అక్తర్

కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారత్-పాకిస్తాన్ ఒకరికొకరు సహాయపడాలని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు, ఎందుకంటే ఈ సమయంలో దేశాలు లేదా మతం గురించి కాదు, మానవత్వం గురించి ఆలోచించాలి అని తెలిపారు. అందువల్ల ఇటువంటి సమయం లో భారతదేశం పాకిస్థాన్ కోసం 10,000 వెంటిలేటర్లను తయారు చేయగలిగితే, పాకిస్తాన్ ఈ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది" అని అక్తర్ తెలిపారు. అంతకుముందు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్వచ్ఛంద సంస్థ కోసం విరాళం ఇవ్వమని  కోరినందుకు భారత క్రికెట్ దిగ్గజాలు యువరాజ్ సింగ్ మరియు హర్భజన్ సింగ్ విరాళాలు అందజేశారు దాంతో వారిని విమర్శించారు అభిమానులు. ఈ విషయం పై అక్తర్ ఇలా సమాధానమిచ్చాడు... “వారిని విమర్శించడం అమానవీయం. ఇది ప్రస్తుతం దేశాల గురించి లేదా మతం గురించి కాదు, ఇది మానవత్వం గురించి" అని అన్నారు. భారత ప్రజల నుండి నాకు లభించిన ప్రేమ గురించి నేను ఎప్పటికీ కృతజ్ఞుడను " అని పేర్కొన్నారు.