సర్ఫరాజ్‌కు బుర్ర లేదు: అక్తర్‌

సర్ఫరాజ్‌కు బుర్ర లేదు: అక్తర్‌

భారత్‌ చేతిలో ఘోర పరాజయం పాలవడంతో పాక్‌ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సర్ఫరాజ్‌ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాల వల్లే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయామని పాక్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ విమర్శించాడు. పాక్‌ ప్రధాన బలం బౌలింగ్‌ అని.. అటువంటప్పుడు తొలుత బౌలింగ్‌ చేయడం చాలా పెద్ద తప్పిదం అని అన్నాడు. టాస్‌ గెలవగానే సగం మ్యాచ్‌ గెలిచినట్టేనని  భావించామని.. కానీ భారత్‌కు తొలుత బ్యాటింగ్‌ అప్పగించి సర్ఫరాజ్‌ పెద్ద తప్పు చేశాడని అక్తర్‌ విమర్శించాడు. సర్ఫరాజ్‌ది బ్రెయిన్‌లెస్‌ కెప్టెన్సీ అని విమర్శించిన అక్తర్‌.. ప్రతి మ్యాచ్‌లోనూ బుద్ధి లేని నిర్ణయాలు తీసుకుంటున్నాడని అన్నాడు.