ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న చేతులతో బూట్లు మోయిస్తారా : అక్తర్

ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న చేతులతో బూట్లు మోయిస్తారా : అక్తర్

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మొదటి టెస్ట్ లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టులో స్థానం దక్కింది కానీ తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక రెండో రోజు సర్ఫరాజ్ వాటర్ బాయ్ గా మరి ఆటగాళ్లకు వాటర్ అందించాడు. అంతే కాకుండా షాదాబ్ ఖాన్ కు మ్యాచ్ మధ్యలో బూట్లు కూడా అందించాడు. ఈ విషయం పై పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయం పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. పాక్ జట్టుకు నాలుగు సంవత్సరాలు న్యాయకత్వం వహించిన కెప్టెన్ తో ఇంటి పనులు చేయిస్తారా... ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న చేతులతో బూట్లు మోయిస్తారా అని ప్రశ్నించాడు. సర్ఫరాజ్ కెప్టెన్సీలో 2017 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ను ఓడించి పాక్ జట్టు విజేతగా నిలిచింది. 


అక్తర్ మాట్లాడుతూ... సర్ఫరాజ్ స్వయంగా ఈ పని చేస్తే పర్వాలేదు.. అయిన కూడా తనను జట్టు సభ్యులు ఆపాల్సింది. నేను ఆడే సమయంలో మా కెప్టెన్ వసీం అక్రమ్ ఎప్పుడు ఇటువంటి పనులు చేయలేదు అని చెప్పాడు. ఈ వివాదం పై పాకిస్థాన్ చీఫ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ స్పందించాడు. ‘‘క్రికెటర్ ఇలాంటి చాలా సాధారణ విషయం. అది సర్ఫరాజ్‌ కూడా తెలుసు. ఆ సమయం లో అక్కడ ఏ ఆటగాడు అందుబాటులో ఉంటె వారు ఆ పని చేస్తారు'' అని తెలిపాడు. ఇక ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇప్పటివరకు పాక్ దే పై చేయి  అని చెప్పాలి.