కార్గిల్ లో పాల్గొనాలనుకున్నాను అంటూ అడ్డంగా బుకైనా అక్తర్...

కార్గిల్ లో పాల్గొనాలనుకున్నాను అంటూ అడ్డంగా బుకైనా అక్తర్...

ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ వాయిదా నుండి పాకిస్థాన్ ఆటగాళ్లు భారత జట్టుపైన తరచు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలానే తమ దేశంలో వార్తలో నిలవడానికి తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి కొన్ని సందర్భాలలో వారే అడ్డంగా బుక్కవుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా 'కార్గిల్ యుద్ధం లో పాల్గొనాలనుకున్నాను' అని చెప్పి అలానే బుక్కయ్యాడు. 

ఈ మధ్య తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అక్తర్ మాట్లాడుతూ... నేను దేశం కోసం చావడానికైనా సిద్ధంగా ఉంటాను. నేను మొదటిసారి ఆర్మీలో చేరడానికి 175,000 పౌండ్ల ఒప్పందం వదులుకున్నాను. కానీ అప్పుడు కుదరలేదు. అలాగే మరోసారి కార్గిల్ యుద్ధం లో పాల్గొనడానికి అలాంటి ఒప్పందనే నేను 2002 లో వదులుకున్నాను అని చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. ఎందుకంటే మనందరికి తెలుసు కార్గిల్ వార్  జరిగింది 1999 మే 2 నుండి జులై 26 వరకు అని. ఇక గత జులై 26 న కూడా కార్గిల్ అమరవీరులకు భారత ఆటగాళ్లు నివాళులర్పించారు. అయితే 1999 లో జరిగిన కార్గిల్ లో పాల్గొనడానికి అక్తర్ 2002 లో ఒప్పందం వదులుకున్నాడట! ఇక ఈ  విషయం తెలిసిన తర్వాత భారత అభిమానులు అక్తర్ ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.