అక్తర్ బయోపిక్ లో సల్మాన్...? 

అక్తర్ బయోపిక్ లో సల్మాన్...? 

చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా చాల దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే ఈ వైరస్ కారణంగా అని కార్యక్రమాలు నిలిచిపోయాయి. అందువల్ల సెలబ్రెటీలు,  క్రీడాకారులు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్న వారు అక్కడ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా అదే పని చేసాడు.  అయితే అందులో మీ బయోపిక్ లో ఎవరు నటించాలని మీరు అనుకుంటున్నారు..? అని ప్రశ్నించగా దానికి అక్తర్ ఇలా సమాధానం ఇచ్చాడు. నా బయోపిక్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించాలి. ఎందుకంటే నా పాత్రలో ఆయన ఒకడే సరిగ్గా సెట్ అవుతాడు అని తెలిపాడు. అయితే చూడాలి మరి ఈ విషయం పైన సల్మాన్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది.