మరోసారి భారత క్రికెటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్తర్...

మరోసారి భారత క్రికెటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్తర్...

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత క్రికెటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. అయితే ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ వాయిదా నుండి పాకిస్థాన్ ఆటగాళ్లు భారత జట్టుపైన తరచు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలానే తమ దేశంలో వార్తలో నిలవడానికి తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. షోయబ్ అక్తర్ కూడా ఆ మధ్య నేను 2002 లో కార్గిల్ యుద్ధం లో పాల్గొనాలనుకున్నాను అని చెప్పి బుక్కయ్యాడు. అయితే ఇప్పుడు మరోసారి వార్తల్లో ఉండటానికి తన బౌలింగ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రత్యర్థి జట్ల క్రికెటర్లను అవమానిస్తూ మాట్లాడాడు. 

ఈ మధ్య ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో అక్తర్ మాట్లాడుతూ... నా బౌన్సర్లకు బ్యాట్స్మెన్లు అందరూ బయపడుతారు. నేను ఆడే సమయం లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ కు నా బౌలింగ్‌ లో దెబ్బ తగిలించుకున్నాడు. అయితే ఆ దెబ్బకు సంబంధించిన గుర్తును నేను కలిసిన ప్రతిసారి చూపిస్తాడు అని చెప్పాడు. అలాగే భారత టేలెండర్ బాట్స్మెన్ లు నన్ను బ్రతిమిలాడేవారు. వారు నా దగరకు వచ్చి ''నీవు మమల్ని ఔట్ చేసుకో కానీ బౌన్సర్లు మాత్రం వేయకు. ఎందుకంటే... వాటి కారణంగా మాకు గాయాలు అవుతాయి. మాకు భార్యాపిల్లలు ఉన్నారు. మా తల్లిదండ్రులు చూస్తే వారు బాధపడతారు' అని నాతో వారు చెప్పేవారు అంటూ వ్యాఖ్యలు చేసాడు. ఇక అక్తర్ చేసిన వ్యాఖ్యల పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.