బ్యాట్ తో స్టంపును కాదు.. బాల్ ను కొట్టాలి

బ్యాట్ తో స్టంపును కాదు.. బాల్ ను కొట్టాలి

శుక్రవారం ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఔటైన తీరుపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన బంతిని మాలిక్ తాను నిలుచున్న స్ధానం నుంచి వెనక్కి వెళ్లి బాల్ కు బదులు స్టంప్స్ ను కొట్టాడు. షోయబ్‌ ఆడిన తీరుపై బౌలర్లు సైతం ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఇది బాగా వైరల్‌ అవుతోంది.