రాంచరణ్‌ అత్త ఓటు గల్లంతు..

రాంచరణ్‌ అత్త ఓటు గల్లంతు..

ఏపీ, తెలంగాణలో ఓట్ల గల్లంతు వ్యవహారం కొనసాగుతూనే ఉంది. సామాన్యుల ఓట్లే కాదు... ప్రముఖుల ఓట్లు కూడా తొలగిస్తున్నారు. దీనిపై ఓవైపు ఆందోళన వ్యక్తమవతున్నా అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడంలో లేదు. సినీ హీరో రాంచరణ్‌ తేజ్ అత్తగారు, అపోలో ఆస్పత్రి వైస్ చైర్‌పర్సన్ శోభనా కామినేని ఓటు కూడా జాబితా నుంచి తొలగించారు. విదేశాల నుంచి ఓటువేయడానికి హైదరాబాద్ వచ్చిన శోభనా కామినేని.. తన ఓటు తొలగించారనే విషయం తెలిసి మండిపడ్డారు. ఓటరు గుర్తింపు కార్డుతో మాసబ్‌ట్యాంక్‌లోని పోలింగ్ స్టేషన్‌కు వెళ్లిన ఆమెకు ఓటర్ల జాబితాలో పేరు లేదని తెలిసింది. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పోలింగ్ స్టేషన్‌లో తాను ఓటువేశానని.. పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చేసరికి తన ఓటు ఎలా తొలగిస్తారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించడం క్రైమ్‌గా పేర్కొన్నారు శోభనా కామినేని.