రామ్‌చరణ్ అత్త ఓటు మిస్.. ఒకరిపై వేటు

రామ్‌చరణ్ అత్త ఓటు మిస్.. ఒకరిపై వేటు

అపోలో ఆసుపత్రుల గ్రూప్‌ ఎగ్జిక్యుటివ్‌ వైస్‌చైర్‌పర్సన్‌, ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ అత్త శోభన కామినేని ఓటు గల్లంతుపై జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఇందుకు బాధ్యులైన బూత్‌ లెవల్‌ అధికారి ఓం ప్రకాశ్‌ను హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్‌ సస్పెండ్‌ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నరేందర్‌రెడ్డిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేశారు. మెహదీపట్నం సర్కిల్‌లోని విజయనగర్‌ కాలనీ పోలింగ్‌ బూత్‌ నంబరు 49లో శోభన కామినేనికి చట్టవిరుద్ధంగా రెండు ఓట్లు ఉండడంతో ఒక ఓటును తొలగించాల్సిందిగా ఓంప్రకాశ్‌కు ఆదేశాలందాయి. ఐతే.. శోభన కామినేనికి లిఖిత పూర్వకంగా '7ఏ' జారీ చేయకుండానే రెండు ఓట్లను జాబితాలోంచి తొలగించారు.