దిశ కేసు...ఆదిరెడ్డి భవానీకి షాక్

దిశ కేసు...ఆదిరెడ్డి భవానీకి షాక్

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో పెట్టిన కేసు రాజకీయ దురుద్దేశంతో కూడిందని  తూర్పుగోదావరి అర్బన్ జిల్లా ఏఎస్పీ లతా మాధురి  సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం డిసెంబర్  16న అసెంబ్లీలో  మద్యం పాలసీపై  చర్చ జరుగుతుండగా  బ్రాండెడ్ మద్యం అమ్మకాలు జరపడంలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై స్పీకర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని, ఈ విషయం ప్రస్తుతం సెక్రటేరియట్ పరిధిలో ఉందని వివరించారు.  ఘటన జరిగి 55 రోజులు దాటిన  తరువాత ఇప్పుడు దిశ చట్టం కింద కేసు నమోదు చేయమనడం  భావ్యం కాదన్నారు.  దిశ చట్టం అమలు కాకుండా పోలీసుస్టేషన్ ఎందుకు ఏర్పాటు చేశారని టిడిపి నేతలు ప్రశ్నించడం రాజకీయ దురుద్దేశంతోనే  కూడిందని అన్నారు. టిడిపి నేతలు ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొనేలా చేయడంపై  ఏమి చర్యలు తీసుకోవాలనే విషయంపై న్యాయ సలహా తీసుకుంటామని  అంటున్నారు ఏఎస్పీ లతా మాధురి. ఐతే దిశ ఒక స్పూర్తి మాత్రమేనని, కేసు ప్రమాదకర పరిస్థితిని బట్టి  జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తామని తెలిపారు. అయితే తన మీద దుష్ప్రచారం, సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేస్తే, ఏకంగా పోలీసు అధికారే ఇది రాజకీయ దురుద్దేశ ఫిర్యాదు అని ప్రకటించడం నిజంగా ఆమెకు షాకింగ్ అనే చెప్పాలి.