టీడీపీకి షాక్...టీడీఎల్పీ సమావేశానికి నలుగురు డుమ్మా ?

టీడీపీకి షాక్...టీడీఎల్పీ సమావేశానికి నలుగురు డుమ్మా ?

కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. మండలి రద్దు ప్రచారం జరుగుతుండడంతో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీఎల్పీ చర్చించనుంది.. అయితే వివిధ కారణాలతో టీడీఎల్పీ సమావేశానికి హాజరు కాలేమని ఐదుగురు ఎమ్మెల్సీలు సమాచారమిచ్చారు. సరస్వతి, తిప్పేస్వామి, కేఈ ప్రభాకర్, శతృచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ ఈ మేరకు సమాచారం అందించారు. అటు తమ ఎమ్మెల్సీలకు అధికార పార్టీ గాలం వేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ను మినహాయిస్తే టీడీపీకి 32 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. ఇప్పటికే పోతుల సునీత, శివనాథరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. రాజీనామా చేయడంతో డొక్కా మాణిక్యవరప్రసాద్ మండలికి హాజరుకావడం లేదు. మరొక ఎమ్మెల్సీ శమంతకమణి కూడా అనారోగ్య కారణాలతో రావడం లేదు. ఇప్పుడు టీడీఎల్పీ సమావేశానికి రాలేమని మరో నలుగురు ఎమ్మెల్సీలు చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.