జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ..!

జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గ్రీన్‌కో కంపెనీకి జగన్‌ సర్కార్‌ ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టిన ట్రిబ్యునల్.. పీపీఏల్లో ధరలు తగ్గించే అంశంలో గ్రీన్‌కో సంస్థలకు అనకూలంగా ఆదేశాలిచ్చింది. యూనిట్‌ ధర 4.50 నుంచి రూ.2.44కి తగ్గించాలని గ్రీన్‌కో కంపెనీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని పేర్కొన్న గ్రీన్‌కో.. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. ఐతే.. 2018 నాటి కేసులు పెండింగ్‌లో ఉన్నందున తాజా నోటీసులపై ట్రిబ్యునల్‌ స్టే విధించింది. తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.