ఎన్నికల ముందు జానారెడ్డికి షాక్ !

ఎన్నికల ముందు జానారెడ్డికి షాక్ !

మరికొద్ది రోజులల్లో నాగార్జున సాగర్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కుందూరు జానారెడ్డికి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేస్తున్నానని మీడియా ముందు జానారెడ్డి ప్రధాన అనుచరుడు డా.రవి కుమార్ నాయక్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంభ పాలన నడుస్తోందని కేంద్రంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాదిరిగా నాగార్జున సాగర్ లో కూడా జానారెడ్డి కుటుంబ పాలన చేస్తున్నాడని ఆయన విమర్శించారు. జానా రెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నాడని జానారెడ్డి కోసం నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినా నన్ను పట్టించుకోలేదని ఆయన అన్నారు. బిజెపి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుణ్ణి అయి బీజేపీ పార్టీ లో చేరుతున్నానన్న ఆయన నియోజక వర్గం నుండి గిరిజన గొంతును వినిపిస్తానని రవి కుమార్ నాయక్ అన్నారు.